అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మునుగోడు ఎమ్మెల్యే
మర్రిగూడ, (జనంసాక్షి): అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,మర్రిగూడ మండలంలోని మేటి చందాపురం గ్రామంలో గత వారం రోజులుగా రెండు వర్గాల మధ్య తీవ్ర వివాదం నడుస్తుంది, ఒక వర్గం వారు ఊరు మధ్యలో నిర్మించాలని ఇంకో వర్గం వారు ఇప్పటికే ఊరు చివరన దిమ్మె ఏర్పాటు చేశారు, కొంతమంది గ్రామస్తులు ఈ విషయంపై అభ్యంతరాలు ఉన్నట్లు కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా అనుమతులు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు, అయితే రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, విగ్రహ ఆవిష్కరణకు కలెక్టర్ ఆంక్షలు ఉన్నప్పటికీ ఆదివారం సాయంత్రం7 గంటల సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు, కార్యక్రమంలో మర్రిగూడ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, నాంపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వెన్నమనేని రవీందర్రావు, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నక్క శ్రీనివాస్ యాదవ్, డైరెక్టర్ జమ్ముల వెంకటేష్, నేటి చందాపురం మాజీ సర్పంచ్ జంగిలి లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.