నల్లగొండ కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌…. అమలు కానీ ఆదేశాలు

మర్రిగూడ, (జనంసాక్షి): కలెక్టర్ ఆదేశాలు బికాతర్.కలెక్టర్ ఆదేశాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన మండల అధికారులు, అర్ధరాత్రి వరకు కొంతమంది అధికారులు అక్కడే ఉండి మరి ఊరి చివరన పెట్టే విధంగా ప్రోత్సహించారని, ఉన్నత వర్గాలకు ఇప్పటికి కూడా వివక్షత ఉన్న కారణం తోనే ఊరి మధ్యలో పెట్టవలసిన విగ్రహం ఊరి చివరన అర్ధరాత్రి కలెక్టర్ ఆదేశాలను గాలికి వదిలి కొంతమంది అధికారుల ప్రోత్సాహంతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారని నామ పురం మాజీ ఎంపీటీసీ ఉరిపక్క నగేష్ అన్నారు,గ్రామంలో శాంతిభద్రతలకు విగాథం…జిల్లా ఎస్పీకి ఫిర్యాదు నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని  మేటి చందాపురం గ్రామంలో నిర్మిస్తున్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం కొంతమంది స్వార్థపూరితంగా  రాజకీయ లబ్ధి కోసం అంబేద్కర్ విగ్రహాన్ని ఊరి చివరన  నిర్మిస్తున్నారని, ఊరి మధ్యలో పెట్టాలని గ్రామ చివరిలో ఒక కులానికి సంబంధించినదిగా గత నెలలో నిర్మాణం చేపడితే నిర్మాణ పనులు చేస్తుంటే గ్రామంలోని మెజార్టీ సభ్యులు దళిత సంఘాలు అందరు ఒకే మాటగా అంబేద్కర్  విగ్రహమును ఊరి మధ్యలో పెట్టాలని  నిర్ణయించారు, గ్రామస్తులు ఏప్రిల్ 4, కలెక్టర్, జిల్లాఎస్పీ  మర్రిగూడ తహశీల్దార్, మర్రిగూడ ఎస్సై, పంచాయతి సెక్రటరీ  వ్రాతపూర్వకంగా పోస్టల్  కంప్లీట్ చేశారు, జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది, మండల అధికారులు కలెక్టర్ ఉత్తర్వులు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు, కొంతమంది అధికారులు అర్ధరాత్రి వరకు దగ్గరుండి మరి ఈ విగ్రహాన్ని ఊరు చివరన పెట్టిచ్చారని గ్రామస్తులు, పూర్వకాలం మాదిరిగానే భారత రాజ్యాంగ నిర్మాతను ఊరికి అవతల ప్రతిష్టించటం సరి కాదని, ఒక్కప్పుడు అగ్రవర్ణాలు చేసిన అవమానం మాదిరిగానే నేడు మళ్ళీ అంబేద్కర్ కి విగ్రహ ప్రతిష్టతో అవమానం జరిగిందని, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.