NHM 2వ ఏ ఎన్ ఎం లను రిగ్యులర్ చేయాలి

జనం సాక్షి ప్రతినిధి మెదక్ _________
ఎన్ హెచ్ ఎం రెండవ లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ మెదక్ డిఎం ఉండొచ్చా కార్యాలయం ముందు ధర్నా నిర్వహించే విజయలక్ష్మి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి కే నరసింహ కార్యదర్శి సంగీత మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏ ఎన్ ఎం లు గత 15,20 సంవత్స రాల నుండి పని చేస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ రెగ్యులర్ చేయకపోవడం అన్యాయం అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసి అందరినీ రెగ్యులర్ చేస్తానని గత ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినప్పటికీ 8సంవత్స రాలు గడుస్తున్న రెగ్యులర్ చేయకపోవడం 2 వ ఏ ఎన్ ఎం ల పట్ల ప్రభుత్వ చిత్త శుద్ది లేదని అర్థమౌతుందని వారు అన్నారు.ఇప్పటికీ ప్రమాద బీమా సౌకర్యం , ఇతర సౌకర్యాలు కల్పించక పోవడం అన్యాయం అన్నారు.హెల్త్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్న ,వేతనం తో కూడిన మెటర్నిటీ సెలవులు లేకపోవడం దుర్మార్గం అన్నారు.పిల్లల తల్లులకు తల్లిపాల గురించి చెప్తూ,తమ పిల్లలకు మాత్రం అన్యాయం చేస్తుందన్నారు traking వర్క్ కోసం ,జీరాక్స్ ల కోసం నెలకు 1500/ ల రూపాయలు చేతి నుండి ఖర్చు చేయాల్సి వస్ట్టుందన్నరు. మెటర్నిటీ లీవులు లేకపోవడం తో 3,4 నెలల వేతనాలు కోల్పోవలసి వస్తుందన్నారు.అన్ని phc lalo వాటర్, బాత్రూమ్ లు,మీటింగ్ హాల్స్ లేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని.యూ నిఫాం అలవెన్స్ 2,500 / ,సబ్ క్సెంట్రే రెంట్ 1500/ ,వెంటనే చెల్లించాలన్నారు. రెగ్యులర్ చేయకుండా వెట్టిచాకిరి చేయిస్తుందన్నరు.రెగ్యులర్ ఉద్యోగుల తో సమానంగా పని చేయిస్తూ తక్కువ వేతనాలను చెల్లిస్తుందన్నరు.సుప్రీం కోర్టు సమాన పనికి సమన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చినప్పటికీ రాష్ట్రం లో అమలు చేయడం లేదన్నారు .వ్యాక్సిన్ అలవెన్సు ఇవ్వాలన్నారు.11వ PRC ప్రకారం బేసిక్ వేతనం 31,040. / రూ..ఉండాలన్నారు.ఫీల్డ్ డ్యూటీ చేస్తున్న వారికి f.t.a సౌకర్యం కల్పించాలని,HR పాలసీ కల్పించాలని,నైట్ డ్యూటీలు ,op డ్యూటీ లు రద్దు వారు కోరారు.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని,లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తు న్న పోరాటాలు నిర్వహిస్తామని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి,అనసూయ,దుర్గ,యాదమ్మ,తులసి,ప్రవీనాషీల,కవిత,కృష్ణవేణి,చంద్రకళ,సునీత,ఇందిరా తదితులు పాల్గొన్నారు.