దత్తాపూర్ లో క్షుద్ర పూజల కలకలం

– భయాందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు
ఆర్మూర్, మార్చి 10 ( జనం సాక్షి):
ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపింది.పాఠశాల ఆవరణలోనే అంగన్వాడి కేంద్రం ఉంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆదివారం అంగన్వాడీ కేంద్రం ముందర క్షుద్ర పూజలు నిర్వహించారు.అంగన్వాడి భవనం ఎదురుగా పసుపు కుంకుమ, వేప కొమ్మలు నిమ్మకాయలు, కత్తి ఉండడని చూసి పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు, అంగన్వాడీ విద్యార్థులు ఆందోళనకు గురైనారు.పాఠశాలకు రావాలంటే విద్యార్థులు జంకుతున్నారు.విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ అంగన్వాడి కేంద్రంన్ని నీటితో పరిశుభ్రం చేశారు.ఇలాంటి సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని,పోలీస్ కేసు నమోదు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.



