బీఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు ప్రజలు వెల్లువల వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు

నల్గొండ బ్యూరో (జనంసాక్షి) :  ఈనెల 27న వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ 25 ఏళ్ల పండుగకు వెల్లువలా జనాలు తరలివచ్చేందుకు సన్నద్ధం అవుతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ పట్టణ కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ లో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన నల్గొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సన్నాక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ సభలు పెట్టడం లో గిన్నిస్ రికార్డ్ మన సొంతం అన్నారు.పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు తెరాస ఉండదని, మధ్యలోనే బంద్ అయితదని శాపనార్థాలు పెట్టిండని,మొదటి వార్షికోత్సవ సభ నల్గొండ లొ పెట్టి సూపర్ సక్సెస్ చేశామని గుర్తు చేశారు. ఎన్నో మైలు రాళ్లను అధిరోహించి,మిము…ఎన్నో రాక్షసులను తరిమికొట్టామని చెప్పారు. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తాం అని చెప్పి మోసం చేస్తే మన పిల్లలు ఆత్మబలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వాదం ఉందని, నల్గొండ జిల్లాలో ఎన్నో సభలు పెట్టినం,ఉద్యమంలో నల్గొండ జిల్లా స్థానం పదిలం అన్నారు.మన జిల్లా ఉద్యమాల జిల్లా, ఇక నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి కోతల మంత్రిగా మారిండని,కోమటిరెడ్డి ఒట్టి చేతకాని మంత్రి,వీళ్ళ చేతకాని తనం వల్లనే రైతులపై మిల్లర్లు దళారులు దాడులకు దిగుతున్నారని పేర్కొన్నారు. మిర్యాలగూడలో మద్దతు ధర ఇవ్వమని అడిగితే మిల్లర్లు దళారులు కలిసి రైతులపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు.నిన్న సూర్యపేట లో ఓ రైతు మద్దతు ధర రాక ధాన్యం రాశులకు నిప్పు పెట్టుకున్నాడని, రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని,ఎస్ ఎల్ బి సి ని శాశ్వతంగా మూసి వేసే కుట్ర చేస్తున్నారని తెలియజేశారు.ఈ దద్దమ్మలకు ఎస్ ఎల్ బి సి ని పూర్తి చేసే దమ్ము లేదని విమర్శించారు. అందులో ప్రమాదం జరిగితే సహాయక చర్యలు చేసి బాధితులను వెలికితీసే దమ్ము ,తెలివి ఈ కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. ప్రతి రైతు గుండెల్లో కెసిఆర్ వున్నాడని,రైతుల ఆత్మబంధువు కేసీఆర్ అని తెలియజేశారు. మంత్రులు దందా లో మ్యూనిగితెలుతున్నారని, కోమటిరెడ్డి అనుచరుల దుర్మార్గులాతో నల్గొండ జిల్లా సర్వ నాశనం అవుతున్నదని చెప్పారు. ప్రజల సహనం నశిస్తే కోమటిరెడ్డి ని నల్గొండ కు కూడా రానివ్వరన్నారు. వీళ్లు చేయని దందా లేదని, ప్రభుత్వ హాస్టల్స్ లలో కల్తీ నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు.కోమటిరెడ్డి మనుష్యులు… ఇది దుర్మార్గం… వరంగల్ సభ చరిత్రలో నిలిచిపోతుందని జగదీష్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.