రియల్టర్ చేతిలో రివాల్వర్ మిస్‌ఫైర్
హైదరాబాద్, జులై 11 : నగరంలోని హిమాయత్‌నగర్‌లో ఓ రియల్టర్ చేతిలో తుపాకీ మిస్‌ఫైర్ అయింది. దీంతో రియల్టర్ ముత్యాల రమేష్ తొడలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో వెంటనే అతడిని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న రమేష్ తనకు ప్రాణహానీ ఉందంటూ గత ఏడాది రివాల్వర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుని లైసెన్స్ పొందాడు. ఈ నేపథ్యంలో తనకు పెళ్లి సంబధాల కోసం షాదీడాట్ కామ్ ఆఫీసుకు వెళ్లగా అక్కడ అమ్మాయిలను చూసి ఒక్కసారిగా రివాల్వర్‌ను ప్రదర్శించాడు. దీంతో రివాల్వర్ మిస్ ఫైర్ అయింది. సమాచారం అందుకు పోలీసులు అక్కడకు చేరుకుని రివాల్వర్‌తో పాటు ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు నిజామాబాద్ జిల్లా కామారెడ్డి వాసిగా తెలుస్తోంది.