వీర్కో పరిశ్రమల్లో విద్యార్థుల సాంకేతిక విజ్ఞాన పర్యటన
పటాన్చెరు, అక్టోబర్ 26 (జనంసాక్షి) : ప్రభుత్వ పాఠశాలలో డ్రాప్ అవుట్ అవుతున్న విద్యార్థులను గుర్తించి ఆయా విద్యార్థులకు విద్యాభ్యాసం చేయించడానికి విద్యార్థులను ప్రోత్సహించేందుకు స్టెమ్మిపై ఇంగ్ ప్రాజెక్టు చైర్మన్ సాయి వైైనవి రెడ్డి స్పష్టమైన ప్రణాళికను రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం పటాన్ చేరు పారిశ్రామికవాడలోని వీర్కో కెమికల్స్ పరిశ్రమలో స్టేమిఫయింగ్ ప్రాజెక్ట్ చైర్మన్ సాయి వైనవి రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని అన్వర్ ఉలూమ్ బి ఫార్మసీ కళాశాల సుమారు వందమంది విద్యార్థులకు సాంకేతిక విజ్ఞాన పర్యటనను నిర్వహించారు. పరిశ్రమలోని ముడి పదార్థాల వాడకం నూతన ఉత్పత్తుల ప్రాసెసింగ్ కార్మికుల భద్రత రసాయన పరిశ్రమలలో యాజమాన్యాలు తీసుకుంటున్న కట్టుదిట్టమైన భద్రత చర్యలు, క్వాలిటీ కంట్రోల్, ప్యాకింగ్ తదితర అనేక అంశాల పైన పరిశ్రమ లో విద్యార్థులకు సాంకేతిక విజ్ఞాన చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా స్టేమిఫయింగ్ ప్రాజెక్టు చైర్మన్ సాయి వైైనవి రెడ్డి మాట్లాడుతూ నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాలలో దూసుకుపోతున్నారని అన్నారు. ప్రధానంగా పాఠశాల దశ, కాలేజీ దశల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు అర్ధాంతరంగా చదువులు మానివేస్తున్నారని అనేక కారణాల దృష్ట్యా పెద్ద ఎత్తున డ్రాప్ అవుట్ అవుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల డ్రాప్ అవుట్స్ నివారించడానికి తమ సంస్థ ఇప్పటికే అనేక రకాల చర్యలు ప్రారంభించిందని సూచించారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తే పటాన్ చెరువు పారిశ్రామికవాడాలని అనేక పరిశ్రమలలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయని ఆయా పరిశ్రమలలో బీఫార్మసీ విద్యార్థులకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని తెలిపారు. విద్యార్థులు అకుంఠిత దీక్షతో పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసిస్తే అద్భుతాలు సాధించగలుగుతారని డ్రాప్ అవుట్ విద్యార్థులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి తిరిగే విద్యాభ్యాసాన్ని అభ్యసించేందుకు తమ ప్రాజెక్టు కృషి చేస్తుందని అలాంటి విద్యార్థులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కడ ఉన్నా అలాంటి వారిని చేరదీయడానికి ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరికో పరిశ్రమ హెచ్ ఆర్ మేనేజర్ సుబ్బారెడ్డి, అన్వర్ లూమ్ కళాశాల బీఫార్మసీ ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ సఫివుల్లా ఘోరీ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.