ఏకలవ్య హాస్టల్ పై ఎమ్మార్వో బాలయ్య అకస్మిక తనిఖీ.

మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశం..

ఏప్రిల్ 7 (జనం సాక్షి ) : ఇందల్వాయిఇందల్వాయి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్‌ను ఎమ్మార్వో బాలయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోషకాహారం అందించాల్సిందిగా సిబ్బందికి సూచించారు.విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మార్వో వారి యోగక్షేమాలను తెలుసుకుని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హాస్టల్‌లో పరిశుభ్రత, వసతి సౌకర్యాలపై కూడా ఆయన పరిశీలన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిపిఓ ప్రమోద్, పాఠశాల ప్రిన్సిపల్, హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అధికారులు చేపట్టిన ఈ తనిఖీతో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించబడతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

తాజావార్తలు