మళ్ళీ తెరుచుకున్న సాగర్ డ్యామ్ క్రష్ట్ గేట్లు

నాగార్జునసాగర్,ఆక్టోబర్ 16(జనంసాక్షి) ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి వరద ప్రవాహం పెరగటంతో బుధవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 6 క్రష్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 48,600 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ కృష్ణానది పరివాహక ప్రాంతాలలో తిరిగి విస్తారంగా వర్షాలు కురుస్తుండటం ఎగువ జలాశయాలన్ని ఇప్పటికే నిండుకుండల మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విసుదల చేస్తుండటంతో ఒక్క సారిగా సాగర్ జలాశయం కు వరద ప్రవాహం పెరిగింది.దీనితో బుధవారం ఉదయం డ్యామ్ 8 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.సాయంత్రానికి వరద ప్రవాహం కొంతమేర తగ్గుముఖం పట్టడంతో 2గేట్లను మూసివేసి 6గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ఈ సీజన్లో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేయడం 5వ సారి కావడం విశేషం.శ్రీశైలం జలాశయం నుండి 93,439 క్యూసెక్కుల నీరు సాగర్ జలాశయానికి చేరుతుంది.దీనితో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు కాగా ప్రస్తుతం 590 అడుగులవద్ద నీరు నిల్వవుంది.డ్యామ్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంది.ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపడుతూ 29,760 క్యూసెక్కుల నీటిని,కుడి కాలువ ద్వారా 6257 క్యూసెక్కుల నీటిని,ఎడమ కాల్వద్వారా 6022 క్యూసెక్కుల నీటిని,ఎస్.ఎల్.బి.సి ద్వారా 2400 క్యూసెక్కుల నీటిని,లోలేవల్ కెనాల్ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.రిజర్వాయర్ నుండి మొత్తం 93,439 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.