దేశ్‌ముఖి గ్రామ అభివృద్ధే ధ్యేయం

భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 11 (జనం సాక్షి):
ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధికి అంకితభావంతో సేవ చేస్తా
సర్పంచ్ అభ్యర్థి జక్కుల దశరథ యాదవ్
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దేశ్‌ముఖి గ్రామ సర్పంచ్‌గా పోటీ చేస్తున్న జక్కుల దశరథ యాదవ్ గ్రామ అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని, ప్రజాసేవే తన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు కట్టుబడి పనిచేస్తానన్నారు. దేశ్‌ముఖి గ్రామ ప్రజలు తనను విజయవంతంగా ఎన్నుకుంటే గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన అభివృద్ధి ప్రణాళికలను వివరిస్తూ, ప్రతి ఇంటికి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం, ప్రతి వీధికి వీధిదీపాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా ప్రత్యేక చొరవ చూపిస్తానన్నారు. పేద విద్యార్థులకు ఫీజుల భారం తగ్గించేలా చర్యలు తీసుకుంటానని, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం సహకారం అందిస్తానని చెప్పారు. మహిళలు, పురుషులకు కూటీర పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం, విస్తృతంగా చెట్ల నాటకం చేపడతామని చెప్పారు. దేశ్ ముఖి బడి, దేవాలయాలు, లైబ్రరీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, గ్రామానికి ప్రత్యేక వైద్యశాల ప్రతిపాదనతో పాటు శ్రీకృష్ణ దేవాలయ నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే గ్రామ ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటామని జక్కుల దశరధ యాదవ్ వెల్లడించారు. మీలో ఒకడిగా గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ, తనను ఆశీర్వదించి ఓటు వేయాలని ఆయన గ్రామ ప్రజలను కోరారు.


