పోస్ట్ ఆఫీస్ సేవలు వినియోగించుకోండి
మధిర ఆర్.సి జులై 01. (జనంసాక్షి)మధిర సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి ఆర్ కోటేశ్వరరావు.పోస్ట్ ఆఫీస్ ద్వారా లభించే అనేక పథకాలను ఉపయోగించుకొని ప్రజలు లబ్ధి పొందాలని మధిర సబ్ డివిజనల్ పోస్టల్ అధికారి ఆర్ కోటేశ్వరరావు తెలిపారు. గురువారం సిరిపురం సబ్ ఆఫీసు పరిధిలో కలకోట బ్రాంచ్ పోస్టు ఆఫీసునందు భారత ప్రభుత్వ కార్యక్ర మం లో భాగంగా డి.సి.డి.పి ప్రోగ్రాం జరిగినది.ఈ కార్యక్రమంలో పోస్టల్ అధికారి యారా కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈనాడు భారత ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ల ద్వారా వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టిందని,దీనిలో మహిళలకు, పిల్లలకు, వృద్ధులతో పాటు ఎన్నో ప్రయోజనాలు ఇచ్చే పథకాలు ఉన్నాయని, వాటిని గ్రామీణ ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు.ముఖ్యంగా మహిళలకు మహిళా సమ్మాన్ యోజన, ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి యోజన లాంటి పథకాలతో పాటు గ్రామీణ తపాలా పోస్ట్ ఆఫీస్ లో లభిస్తున్న అన్ని రకముల లబ్ధి పొందే చిన్న మొత్తాల పొదుపు సంస్థల గురించి మరియు ఇన్సూరెన్స్ ,బ్యాంకింగ్ సేవలు గురించి సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పోస్ట్ ఆఫీస్ ద్వారా లభించే పథకాల గురించిన సమాచారాన్ని పోస్టల్ అధికారులచే అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మధిర సబ్ డివిజన్ యందు పనిచేస్తున్న మెయిల్ ఓవర్సీర్స్ ఉదయ నవీన్,కోటేశ్వరరావు, సెక్రటరీ మహేష్, బ్రాంచ్ పోస్టల్ సిబ్బంది మౌలాలి, సాయి,మురళీ, లక్ష్మణ్ పూజిత, ల తో పాటు గ్రామ పెద్దలు పైడిపల్లి కిషోర్,గ్రామస్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా కలకోట గ్రామ పెద్దలు ,ప్రజలు పోస్ట్ ఆఫీసు నిర్మాణానికి స్థలం ను ఇస్తామని చెప్పినారు. దాని నిర్మాణానికి ప్రభుత్వ సహకారం ను కావాలనికోరారు.