మంత్రి కోమటిరెడ్డిని అడ్డుకున్న బాధితులు

నల్లగొండ : రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండ బైపాస్ రోడ్ బాధితులు ఘోరావ్ చేశారు. బైపాస్ రోడ్డు వల్ల తమ బతుకులు రోడ్డున పడుతున్నాయాంటూ గత కొద్దీ రోజులుగా ఆందోళన చెందుతున్నారు. ఆదివారం ఉదయం కనగల్ మండలం దర్వేషిపురం వెళ్తుండగా మంత్రి కోమటిరెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే ఈ విషయంలో తానేమీ చేయలేను అంటూ మంత్రి అనడంతో బాధితులు కాళ్లవేళ్ల పడ్డారు. మంత్రి కోమటిరెడ్డి స్పందిస్తూ అవసరమైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని హామీ ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.