భర్త ఆచూకీ కోసం భార్య ధర్నా
ఆర్మూర్ : తన భర్త ఆచూకీ తెలపాలని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో సత్‌పుతె గిర్మాజి అశ్విని అనే మహిళ ఆందోళనకు దిగింది. మంగళవారం రోజున అత్తింటి వద్ద ఇద్దరు కుమారులతో కలిసి ఆమె బైఠాయించింది. తన భర్త అరవింద్ కుమార్ ఆచూకీ తెలపాలంటూ డిమాండ్ చేసింది. ఓ బోటిక్ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మూడేండ్లు తనను దూరం పెడుతున్నాడని ఆరోపించిన ఆమె.. తనకు న్యాయం చేయాలని, భర్త ఇంట్లోనే ఉండేందుకు వీలుకల్పించాలని ఆవేదన వ్యక్తం చేసింది.