అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారి ఇళ్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు.

share on facebook

మెట్పల్లి టౌన్ ,సెప్టెంబర్ 23,
జనం సాక్షి
సుమారు 3 1/2 kgs వరకు బంగారం స్వాధీనం.
24లక్షల రూపాయలు నగదు,ప్రాంసరి నోట్స్ , స్వాధీనం
ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన నిబంధనలకు లోబడి ఫైనాన్స్ నిర్వహించాలి.
అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు*
మెట్ పల్లి డిఎస్పీ వంగ రవీందర్ రెడ్డి ప్రెస్ మీట్
జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీమతి సింధుశర్మ ఐపీఎస్ ఆదేశాల మేరకు మెట్పల్లి పట్టణములో అక్రమ ఫైనాన్సు,వడ్డీ వ్యాపారం చేస్తున్నవారి ఇళ్లపై మెట్ పల్లి పోలీసులు ఏక కాలంలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. వారివద్ద నుండి నాన్ జుడిసియల్ బాండ్ పేపర్,ప్రాంసరి నోట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది
మెట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 చోట్ల సోదాలు నిర్వహించగా
బొప్పారాతి లక్ష్మణ్ s/o మల్లారి నుండి 24 లక్షల నగదు స్వాధీనం,
కటకం శివ అనే వ్యక్తి బంగారం కుదవ పెట్టుకొని అవసరాలకు అధిక మొత్తంలో వడ్డీ వ్యాపార నిర్వహిస్తున్నారు. ఇతను ఇంట్లో తనిఖీ నిర్వహించగా సుమారు మూడున్నర కిలోల బంగారం స్వాధీనం,చేసుకోవడం జరిగిందని మెట్పల్లి డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి అన్నారు.అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహించిన, అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని
ప్రజలు తమకు ఉన్న అత్యవసర పరిస్థితిలో , తాత్కాలిక ఇబ్బందులకోసం అధిక మొత్తంలో అవసరంకి మించి అధిక వడ్డిలకు అప్పులు చేసి తరువాత ఆ అప్పులు,అధిక వడ్డీలు చెల్లించ లేక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడి తమ కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. ప్రభుత్వ అనుమతితో చట్టపరమైన పద్దతులలో ఫైనాన్స్ నిర్వహించే వారిని మాత్రమే నమ్మాలి అని , ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకపోయిన అక్రమ ఫైనాన్సు వ్యాపారం నడిపేవారి వివరాలు పోలీస్ వారికి తెలియపరిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అప్పు తీసుకోవడం,ఇవ్వడం నేరం కాదు కానీ ఆర్బిఐ నియమనిబందనలు,తెలంగాణా మని లెండింగ్ చట్టంలోని నిబందనల ప్రకారం చట్ట బద్దంగా ఎవరైనా లైసెన్స్ తొ అప్పులు ఇవ్వవచ్చు, తీసుకోవచ్చు.కాని చట్ట విరుద్ధంగా, అధిక వడ్డీ రేట్లతో సామాన్యుల పై దౌర్జన్యం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సింధు శర్మ హెచ్చరించారు.
ఈ తనిఖీ లో డిఎస్పీ ,రవీంద్ర రెడ్డి , మెట్పల్లి, సి ఐ ఎల్. శ్రీను,ఎస్ ఐ లు సధాకర్, కోటేశ్వర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Other News

Comments are closed.