అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు…

share on facebook

ఈనెల 13న విగ్రహల ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమం..

చిగురుమామిడి (జనంసాక్షి) ఆగష్టు 12: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ జక్కుల రవీందర్ మాట్లాడుతూ ఈనెల 13న అభయాంజనేయ స్వామి ఆలయ పున ప్రతిష్టలో భాగంగా విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విగ్రహ ప్రతిష్ట అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలోని సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు జక్కుల రవీందర, ఉపసర్పంచ్ ముంజ శిరీష ప్రకాష్ గౌడ్,ఎంపీటీసీ ఏలేటి రవీందర్ రెడ్డి,గ్రామస్తులు బండి పాపిరెడ్డి,జక్కుల బాబు,పచ్చిమట్ల శ్రీనివాస్ గౌడ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్, పచ్చిమట్ల రాజ్ కుమార్ గౌడ్, వరుకోలు లస్మయ్య, దొనపాటి రాజిరెడ్డి, కుడుకల కనకయ్య, ముంజ చంద్రయ్య గౌడ్, పులి చంద్రయ్య గౌడ్, పెంటం సత్యనారాయణ, వరుకోలు శ్రీనివాస్,కుడుకల వినోద్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.