ఆర్టీసీ కార్మికులకు చుక్కెదురు

share on facebook


విధుల్లో చేరేందుకు వచ్చిన వారిని అడ్డుకున్న పోలీసులు
సంగారెడ్డి,నవంబరు 26(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా విధుల్లోకి తసీఉకోక పోవడం దారుణమని జెఎసి నేతలు అన్నారు. డిపోల ముందు పోలీస్‌ బందోబస్తు పెట్టి కార్మికులను రాకుండా
చేయడం దారుణమని అన్నారు. కార్మికులను విదుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ఇంతకాలంగా  చేపడుతున్న నిరవధిక సమ్మెను చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు. సంగారెడ్డి బస్టాండ్‌లో మంగళవారం ఆర్టీసీ కార్మికులను కలిసి పలువురు సంఘీభావం తెలిపారు. ఆర్టీసీ కార్మికులు చేసే సమ్మెకు గొప్ప విశిష్టత ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ సమ్మెకు మద్దతిచ్చి ప్రజా రవాణా వ్యవస్థను కాపాడుకోవాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. సమ్మె విరమించకపోతే ప్రైవేట్‌ బస్సులను నడిపిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌,సమ్మె విరమించినా కార్మికులను బెదిరిస్తున్నారని విమర్శించారు. ఎంతో మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు అనంతరం చర్చలకు పోతే పట్టించుకోలేదని అన్నారు. ప్రత్యేక జీత భత్యాల కోసం సమ్మె చేయడం లేదని, న్యాయమైన డిమాండ్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. 52 రోజుల తరువాత రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్‌ చేస్తున్నారు.  తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సమ్మెబాటపట్టారు. సమ్మెపై కోర్ట్‌ లో విచారణ జరుగుతుండగా..మంగళవారం నుంచి కార్మికులు విధుల్లోకి చేరాలని ఆర్టీసీ జేఏసీ నేతల పిలుపునిచ్చారు. జేఏసీ నేతల పిలుపుతో విధుల్లో చేరేందుకు కార్మికులు డిపోలకు తరలివస్తున్నారు. డ్యూటీలో చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అడ్డుకుం టున్నారు. వామపక్షాల నేతలను ముందస్తుగా అరెస్టు చేశారు. బస్‌ డిపో, బస్టాండ్‌ ప్రాంతాల్లో భారీగా పోలీస్‌ బంద్‌ బస్తు ఏర్పాటు చేశారు. పార్టీల నేతలు, కార్మికులు అటువైపు రాకుండా బారీకేడ్లు పెట్టారు.

Other News

Comments are closed.