కేసీఆర్‌ వర్సెస్‌ భట్టి విక్రమార్క

share on facebook

– ఇరువురికి మధ్య అసెంబ్లీలో సాగిన మాటల యుద్ధం
– అంకెల గారడితో సభను తప్పుదోవ పట్టిస్తున్నారన్న భట్టి
– ప్రతిపక్షం ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం
– భట్టి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం కేసీఆర్‌
– దబాయించి మాట్లడకండి.. విూరిచ్చిన లెక్కలతోనే మాట్లాడుతున్నా
–  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
హైదరాబాద్‌, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : అసెంబ్లీలో ఓటాన్‌ బడ్జెట్‌ పై చర్చ సందర్భంగా సిఎం కేసిఆర్‌, సిఎల్పీ లీడర్‌ మల్లు భట్టి విక్రమార్క మధ్య వాడివేడి చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లు 2019పై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అంకెల గారడీతో సభను తప్పుదొవ పట్టించొద్దని సభలో సిఎం కేసిఆర్‌ కు సూచించారు. ఏమి లెక్కలు చెబుతున్నారో అర్ధం కావడం లేదని, విూరిచ్చిన బుక్స్‌ లో అంశాలే తప్ప, కాకి లెక్కలు చెప్పడం లేదని భట్టి విక్రమార్క  విమర్శించారు. దాంతో చర్చలో జోక్యం చేసుకున్న సిఎం కేసిఆర్‌ విూ హాయాంలో చేసిన లెక్కలు కూడా ఉన్నాయి.. తీయమంటారా అని నిలదీసారు. సిఎం సమాధానానికి భట్టి విక్రమార్క అభ్యంతరం తెలుపుతూ విూరు అధికారంలోకి వచ్చిన తరువాత ఇది ఆరోబడ్జెట్‌ అని, ఇంకా ఉమ్మడి రాష్ట్రం గురించి ఎందుకని మాట్లాడతారని భట్టి నిలదీశాడు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే కదా ఉద్యమం చేశారు.. మేము బిల్లు పెట్టి తెలంగాణ ఇచ్చిందని భట్టి బదులిచ్చారు. మళ్లీ ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అంకెలు చెప్తామంటే ఎలా అని సిఎం కేసిఆర్‌ పై ఎదురుదాడి చేశారు. దబాయించి మాట్లాడితే ఎలా విూరు ఇచ్చిన లెక్కలేనని భట్టి సభలో సీరియస్‌ గా మాట్లాడారు. చర్చ మధ్యలో జోక్యం చేసుకున్న సిఎం కేసీఆర్‌.. దబాయించారు అనే పదాన్ని విత్‌ డ్రా చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తాము వింటూ కూర్చొమని నిండు సభలో స్పష్టం చేశారు. రాబడి వచ్చిందని తాము చెబుతుంటే.. రాలేదని కాంగ్రెస్‌ ఎలా అంటుందని కేసీఆర్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ తప్పుగా మాట్లాడితే.. ప్రేక్షకపాత్ర వహించం అని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. దబాయించి మాట్లాడే అవసరం మాకు లేదని సీఎం స్పష్టం చేశారు. తాగు, సాగునీటి విూద రుణం తీసుకునేటప్పుడు తిరిగి ఎలా చెల్లిస్తారని బ్యాంకులు ప్రశ్నిస్తాయని, రుణం తీసుకునేటప్పుడు బ్యాంకులకు రెవెన్యూ స్కీం గురించి చెబుతామన్నారు.. చెల్లింపు సామర్థ్యాన్ని చూసే కమర్షియల్‌ బ్యాంకులు తెలంగాణ ప్రభుత్వానికి అప్పులు ఇస్తున్నాయని అన్నారు. కమర్షియల్‌ బ్యాంకులు రాష్ట్రానికి అప్పు ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం మున్సిపాలిటీ నీళ్లను పుణ్యానికి ఇవ్వలేదన్నారు. మన రాష్ట్రంలో రూ. 1.25 కోట్ల విలువైన పంట పండబోతోందని, ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ విూద ప్రతిపక్షానికి టెన్షన్‌ అవసరం లేదన్నారు. ఏదో అన్యాయం జరుగుతుందని కలవరపడాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్‌ భట్టి విక్రమార్కకు సూచించారు. రాష్ట్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ పార్టీ సభ్యులకు అవగాహన లేదని కేసీఆర్‌ తెలిపారు.  కాంగ్రెస్‌ చెప్పే లెక్కలు సభకే అర్థం కావడం లేదని, ప్రజలకేం అర్థమవుతుందని, సభను, ప్రజలను తప్పుదోవ పట్టియ్యొద్దు అని సీఎం సూచించారు. కాంగ్రెస్‌ చెప్పేది 100 శాతం తప్పు అని, ప్రభుత్వం అన్న తర్వాత చెల్లింపులు కచ్చితంగా ఉంటాయన్నారు. వృద్ధిరేటు చెప్పకుండా కాకి లెక్కలు చెబుతున్నారని, గాల్లో చెప్పకుండా.. బాధ్యతతో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. బడ్జెట్‌ విూద కాంగ్రెస్‌కు అవగాహన లేదని, బడ్జెట్‌లో సవరణలు ఉంటాయని సీఎం
పేర్కొన్నారు. వాటిని తప్పుగా చిత్రీకరించడం సరికాదని, దేశంలోని 29రాష్ట్రాల్లో కూడా బడ్జెట్‌ అంచనాల్లో సవరణలు ఉంటాయని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

Other News

Comments are closed.