గ్రామాల్లో చురకుగా అభివృద్ది పనులు

share on facebook

ఫలిస్తున్న 30రోజుల ప్రణాళిక
మెదక్‌,నవంబర్‌4 (జనంసాక్షి) :  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళిక గ్రామాలకు  ఓ వరంగా మారింది. సొంత పంచాయతీతో గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునే అవకాశాలను సర్పంచ్‌లు ఉపయోగించుకుంటున్నారు. మారుమూల ప్లలెలు, అనుబంధ గ్రామాలు, తండాలకు ¬దా కల్పిస్తే, వారి స్వయం శక్తితో గ్రామాన్ని అభివృద్ధి పరుచుకుంటారనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ గతేడాది ప్లలెలు, అనుబంధ గ్రామాలు, తండాలకు ప్రత్యేక పంచాయతీ ¬దా కల్పించారు. ఇదిలా ఉండగా సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికతో  అభివృద్దికి అవకాశం లభించింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్లాస్టిక్‌ను వాడొద్దంటూ సర్పంచ్‌లతో పాటు సభ్యులు ఇంటింటికీ తిరుగుతూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఇంటికి ఇంకుడుగుంత, మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్‌యార్డ్‌కు ప్రజల సహకారంతో స్థలాన్ని సేకరించారు. చుట్టూ ఉన్న పరిశ్రమల నిర్వాహకులు తప్పనిసరిగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో శ్రమదానం పనులకు సహకారం అందించాలని నోటీసులు అందించారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాతే గ్రామాలకు కి గుర్తింపు లభించిందని, సీఎం కేసీఆర్‌ కలలుగన్న గ్రామంగా గ్రామాలన్ని ఆదర్శంగా నిలుపుకుంటామని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి తెలిపారు.

Other News

Comments are closed.