డబుల్‌ ఇళ్ల హావిూలను నెరవేర్చని ప్రభుత్వం

share on facebook

జనగామ,జూన్‌7(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హావిూని నెరవేర్చలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు జిల్లెల సిద్దారెడ్డి  ఆరోపించారు. రెండు పడక గదుల ఇళ్ల పథకం అమలు కావడం లేదన్నారు.  నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేయాలని సీపీఎం నేత సూచించారు.  రాష్ట్రంలో అభివృద్ధిపై చర్చించడానికి తమ పార్టీ  సిద్ధమన్నారు. అలాగే పార్టీ పరంగా సామాజిక న్యాం కోసం చేస్తున్న ఆందోళనలకు ప్రజలనుంచి మద్దతు వస్తోందని అన్నారు. ముందు ప్రజలకు కావాల్సిన అవసరాలను గుర్తించాలని విమర్శించారు. ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే.. ఐటీ, పరిశ్రమలు, కారిడార్‌ అంటూ కాలాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. డీఎస్సీ నియామకాలు చేయకుండా విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూడకుండా కబుర్లతో కాలక్షేపం చేయడం సరికాదన్నారు.

Other News

Comments are closed.