దుబ్బాక ఫలితమే గ్రేటర్‌లోనూ ఉంటుంది: బిజెపి

share on facebook

మంచిర్యాల,నవంబర్‌17(జ‌నంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునం దన్‌రావు గెలుపు కేసీఆర్‌ నిరంకుశ పాలనకు నిదర్శనమని జిల్లా అధ్యక్షు డు వెరబెల్లి రఘునాథ్‌ పేర్కొన్నారు. ఇదే ఫలితం గ్రేటర్‌ హైదరాబద్‌ ఎన్నికల్లోనూ వస్తుందని అన్నారు. నగర ప్రజలు విజ్ఞులని, వారు టిఆర్‌ఎస్‌కు బుద్ద ఇచెప్పడం ఖాయమన్నారు. దుబ్బాక విజయం ప్రజల విజయమని, కేసీఆర్‌ పతనం దుబ్బాక నుంచి మొదలైందన్నారు. రానున్న రోజుల్లో దుబ్బాక తరహా తీర్పు రాష్ట్రమంతటా ప్రజలు అందించి కేసీఆర్‌కు తగిన బుద్ది చెబుతారన్నారు. కేసీఆర్‌ పలు హావిూలు ఇచ్చి నెరవేర్చకపోవడం వల్ల దుబ్బాక ప్రజలు టీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. గ్రేటర్‌ ఎన్నికలు త్వరగా పెట్టడం చూస్తుంటే టిఆర్‌ఎస్‌లోబయం కనిపి/-తోందని అన్నారు. తెలంగాణ ఉద్యమంతో లబ్ది పొందింది కేవలం కెసిఆర్‌ అని అన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరిట మోసగించడంతో యువత కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర అసహనంతో ఉందని, రైతులను సన్నరకం వరిపంట సాగు చేయమని చెప్పి పంట చేతికి వచ్చాక కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతో రైతులు టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. దుబ్బాక ఫలితం 2023లో పునరావృతమై బీజేపీకి ప్రజలు పట్టం కడతారని జోస్యం చెప్పారు.

Other News

Comments are closed.