– ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు స్వల్పగాయాలు
– సిద్ధిపేట పట్టణంలో ఘటన
సిద్ధిపేట, నవంబర్27(జనంసాక్షి) : నటుడు సంపూర్ణేశ్ బాబు రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారును ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో సంపూర్ణేశ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. సిద్దిపేట పట్టణంలో కొత్త బస్టాండ్ సవిూపంలో బుధవారం ఉదయం సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సంపూర్ణేశ్ బాబు తన భార్య, పిల్లలతో కారులో ప్రయాణిస్తుండగా.. ఆర్టీసీ బస్సు ఆయన కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంపూతో పాటు ఆయన భార్య, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనా స్థలికి వచ్చి సంపూర్ణేశ్ బాబుతో పాటు కుటుంబ సభ్యులకు సాయం అందించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సంపూతో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును తాత్కాలిక డ్రైవర్ నడపుతున్నట్లు తెలిసింది. దీంతో బస్సును నిలిపి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని పోలీసులు స్టేషన్కు తరలించినట్లు సమాచారం.
నటుడు సంపూ కారును.. ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
Other News
- హెరిటేజ్ ఇప్పుడు మా ఆధీనంలో లేదు: భువనేశ్వరి
- గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
- గ్రీన్ఛాలెంజ్లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
- అసెంబ్లీలో కోటంరెడ్డికి అస్వస్థత
- ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆత్మహత్య చేసుకుంటా: హీరో ఆందోళన
- దళిత మహిళల పిల్లలకు గురుకుల విద్య
- సీఎం కేసీఆర్ స్పందించాలి
- భర్తతో గొడవులు..ఉరేసుకున్న కానిస్టేబుల్
- మ్యూజిషియన్ మృతిపై సిబిఐ విచారణ
- నష్టాల్లోకి జారుకున్న దేశీయ మార్కెట్లు