ఫెయిలయిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు

share on facebook

దీనిని ఓ విజయంగా మలచుకోవాలి
ఆత్మహత్యలు పరిష్కారం కాదని గుర్తించాలి
ర్యాంకులు మార్కులే ప్రామాణికం కాదు
సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌
సైబరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ఇంటర్మీడియెట్‌ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేదనే కారణంతో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మేడ్చల్‌ కు చెందిన నవ్యశ్రీ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనర్‌ వీసీ సజ్జనార్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఫలితాల వేళ రాష్ట్రవ్యాప్తంగా పలువురు విద్యార్థులు తనువు చాలించి వారి కుటుంబ సభ్యులకు గుండెకోతను మిగిల్చారు. ఫెయిల్‌ అయితే ఇక జీవితంలో ఏవిూ లేదననే రీతిలో విద్యార్థులు తమకు తాముగా మరణ శాసనం రాసుకుంటున్నారు. జీవితంలో పరీక్షలు అనేవి ఒక భాగం మాత్రమే అని.. పరీక్షలే జీవితం కాదన్నారు. కేవలం చదువే జీవితం కాదు. చదువు  లేకున్నా విషయజ్ఞానాన్ని, హార్డ్‌ వర్క్‌, ప్యాషన్‌ ను నమ్మి ఎంతో మంది జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టి.. చెప్పులు కుడుతూ వీధి దీపాల కింద చదివి అబ్రహాం లింకన్‌ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ అయ్యారని గుర్తు చేశారు. జీవితంలో పెద్దగా చదువు లేనప్పటికీ పట్టుదల, కృషి ఉంటే గొప్పవారు కావచ్చని ఎందరో నిరూపించారిన గుర్తు చేశారు.  వైఫల్యాలే రేపటి విజయానికి బంగారు బాటలని అన్నారు.  చరిత్రలో గొప్పగొప్ప వాళ్లంతా ఓటమి రుచి చూసిన వారే. ఓటమి ఎన్నో గెలుపు పాఠాలను నేర్పుతుందన్నారు. తాము ఎక్కడ తప్పు చేస్తున్నామని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.  తమ పిల్లలు ఫెయిల్‌ ఆయ్యారనే బాధ తల్లిదండుల్లో ఉండడం సహజమే కానీ అదే సమయంలో పిల్లలతో దురుసుగా ప్రవర్తించొద్దు. వారిని సానుకూల దృక్పథంతో ఓదార్చాలని సిపి సూచించారు. తమను ర్యాంకులు తెచ్చిపెట్టే యంత్రాల్లా చూస్తున్న పెద్దవారి సంకుచిత ధోరణిపట్ల నిరసన తెలియజేయడానికి, తాము ఓడిపోయామని ప్రకటించడానికి విద్యార్థులు ఆత్మహత్యను ఓ మార్గంగా ఎంచుకుంటున్నారు. విూ పిల్లల మార్కులు, ర్యాంకుల కంటే కూడా వారి జీవితం, వారి జీవించే హక్కు, వారు జీవించి ఉండడం విూకు అత్యంత ప్రాధాన్యమైనదని విూరు గుర్తించండని హితవు చెప్పారు. ప్రెషర్‌ కుక్కర్‌ చదువులు విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తాయి. మార్కులు, ర్యాంకుల వేటలో విద్యార్థులపై ఒత్తిడి చేయడం మొదటికే చేటు చేస్తుందన్నారు.  ప్రతిభావంతులు సైతం మార్కులు తగ్గాయన్న కారణంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మార్కులు జీవితనైకి భవిష్యత్తు కి కొలమానం కాదని వారికి అర్థమయ్యేలా విడమర్చి చెప్పాలి. ఫెయిల్‌ అయినప్పటికీ రీ-వాల్యుయేషన్‌ చేసుకునే వీలుంది. తొందరపడి ప్రతికూల నిర్ణయాలు తీసుకోవద్దన్నారు.
కోచింగ్‌ సెంటర్లకు సూచనలు..
హండ్రెడ్‌ పర్సెంట్‌ రిజల్ట్‌ లక్ష్యంగా చూపించే కోచింగ్‌ సెంటర్లు… మార్కులు రాకపోతే ఇంక దేనికి పనికిరావనే అభద్రతాభావాన్నివిద్యార్థుల్లో పెంచుతున్నారు. ఈ టెన్షన్‌ వాతావరణాన్ని తట్టుకోలేక దేశవ్యాప్తంగా ఏటా కొన్ని వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు.
పరిమిత అవకాశాలు, అసంఖ్యాక అభ్యర్థుల  మధ్య కొనసాగే పోరులో విజయ సంభావ్యతకు సంబంధించిన అవగాహన కల్పించడం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కనీస బాధ్యత. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పిల్లలపై  ఒత్తిడి చేయడం, ¬మ్‌ వర్క్‌, స్టడీ అవర్స్‌, డైలీ ఎగ్జామ్స్‌, వీక్లీ టెస్ట్‌…ఇలా
కోచింగ్‌ సెంటర్లలో క్షణం తీరిక లేకుండా విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తేవడం మంచిది కాదు.
విద్యార్థులు డిప్రెషన్‌ నుంచి బయట పడేందుకు వారిని వ్యాయామం, యోగా మెడిటేషన్‌ చేయమని ప్రోత్సహించాలి. మోటివేషనల్‌ బుక్స్‌, గొప్ప గొప్ప వారి జీవిత చరైత్రాలను చదివేలా ఎంకరేజ్‌ చేయాలి.
పరీక్షల రకాలు, వాటి స్వభావాలు, లక్ష్యాలు, ప్రణాళికల రూపకల్పనలతో పాటు జీవిత ప్రాధాన్యాన్ని వివరిస్తే, ఓటమిని సైతం గెలుపుగా మలచుకునే విశ్వాసం విద్యార్థుల్లో కలిగించాలని ఓ ప్రకటనలో వివరించారు.

Other News

Comments are closed.