బీహార్‌లో దారుణ ఘటన

share on facebook

భార్యను,మరదలను గన్‌తో కాల్చి చంపిన జవాన్‌

ఆ తరవాత తానూ కాల్చుకుని ఆత్మహత్య

పాట్నా,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): బీహార్‌ రాష్ట్రం బిక్రమ్‌గంజ్‌ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ జవాను కారులో ప్రయాణిస్తున్నప్పుడు తన భార్య, మరదలను గన్‌తో కాల్చి చంపి అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారంవిష్ణు శర్మ అనే జవాను డెంగ్యూ జ్వరం రావడంతో నెల రోజుల సెలవు పెట్టి తన సొంతూరు భోజ్‌పూర్‌కు వచ్చాడు. భోజ్‌పూర్‌ నుంచి పాట్నాకు కారులో అతడి భార్యతో పాటు మరదలు, కుమారుడు, దూరపు బంధువు (డ్రైవర్‌)తో వెళ్తున్నాడు. కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా విష్ణు గన్‌ తీసి మరదలు, భార్యను వరసగా కాల్చాడు. అనంతరం తన

కుమారుడిని కాల్చుతుండగా డ్రైవర్‌ కాపాడాడు. దీంతో వెంటనే విష్ణు గన్‌తో పేల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. డ్రైవర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విష్ణు గత కొన్ని రోజుల నుంచి మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. నవంబర్‌ 22న ఆయన మరదలు వివాహం జరిగింది. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

Other News

Comments are closed.