బైడెన్‌ బలహీన అధ్యక్షుడు

share on facebook

యుద్ధాలకు వెనకాడుతారు

బైడెన్‌పై చైనా ప్రభుత్వ సలహాదారు సంచలన వ్యాఖ్యలు!

వాషింగ్టన్‌, నవంబర్‌ 23 (జనం సాక్షి): అమెరికా అధ్యక్ష ఫలితాలు వెలువడే వరకూ బైడెన్‌ను అధ్యక్షు డిగా గుర్తించమంటూరష్యా అధ్యక్షుడు పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు మరువకమునుపే చైనా ప్రభుత్వ సలహాదారు ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌ బలహీనమైన అధ్యక్షుడని, ఆయన హయాంలో అమెరికాచ్ఖైనా సంబంధాలు మెరుగవుతాయనే ఆశలు పెట్టుకోవద్దని వ్యాఖ్యానించారు. చైనాలోని అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంటెంపొరరీ స్టడీస్‌ అనే థీంక్‌ ట్యాంక్‌కు డీన్‌గా వ్యవహరిస్తున్న జెంగ్‌ యాంగ్నియాన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. బైడెన్‌ కారణంగా యుద్ధాలు కూడా జరిగే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు.చైనాఅ/-ఖమెరికా దౌత్య సంబంధాలకు సంబంధించి మంచి రోజులన్నీ గడిచిపోయాయి. ప్రచ్ఛన్న యుద్ధం నాటి శక్తులు అమెరికాలో గత కొన్నేళ్లుగా క్రియాశీలకంగా ఉన్నాయి. అవి ఇప్పుడప్పుడే తెరమరుగు కావు అని హెచ్చరించారు. అయితే..అమెరికాతో సఖ్యత నెలకొల్పేందుకు చైనా తన ముందుకొచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. చైనా అంతర్జాతీయ నిబంధనలను పాటించేలా అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామంటూ బైడెన్‌ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో జెంగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా విదేశీ వ్యవహారలకు సంబంధించి చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌ నేతత్వంలో ఆగస్టు నెలలో జరిగిన సమావేశానికి సలహాదారు హూదాలో జెంగ్‌ హాజరయ్యారు. ఆ సందర్భంగా అమెరికా విషయంలో చైనా అనుసరించాల్సిన దీర్ఘకాలిక వ్యూహంపై చైనా ప్రభుత్వానికి పలు సలహాలు ఇచ్చారు. అమెరికాలో అన్ని వర్గాల్లోనూ చైనాపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఈ పరిస్థితి బైడెన్‌ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు. ‘బైడెన్‌ కచ్చితంగా బలహీనమైన అధ్యక్షుడే. దేశీయంగా ఉన్న సమస్యలను ఆయన పరిష్కరించలేని పక్షంలో దౌత్యపరంగా ఆయన దుందుకుడు వైఖరి అవలంబించే అవకాశం ఉంది. చైనా వ్యతిరేక చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యానికి ట్రంప్‌ వ్యతిరేకి అని అనుకున్నప్పటికీ..ఆయన యుద్ధాలు ప్రారంభించేందుకు వెనకాడుతారు. కానీ బైడెన్‌ అలా కాదు.. ఆయన ప్రజాస్వామ్యానికి అనుకూలమే అయినా.. యుద్ధాలు ప్రారంభించవచ్చు’ అంటూ జెంగ్‌ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Other News

Comments are closed.