బ్రాహ్మణ వెల్లెంల పథకానికి తక్షణమే నిధులు

share on facebook

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్‌
నల్లగొండ,ఆగస్ట్‌20(జనం సాక్షి): ఉదయసముద్రం -బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకానికి తక్షణమే నిధులు కేటాయించి పూర్తి చేయాలని  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  డిమాండ్‌ చేశారు. ఈప్రాంత రైతులకు మేలు చేకూర్చే ఈ పథకం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. ఇందుకోసం  రైతు పాదయాత్రను తలపెట్టానని తెలిపారు. నిధుల కొరతతో 12 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న ఈ పథకం కోసం ఈ నెల 26 నుంచి 29వ తేదీ వరకు 5వేల మంది రైతులతో పాదయాత్ర చేయాలని నిర్ణయించానని, ఇందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ డీజీపీకి లేఖ అందజేశారు. బ్రాహ్మణ వెల్లెంల నుంచి హైదరాబాద్‌ జలసౌధ వరకు 100 కిలోవిూటర్లుఈ పాదయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అయితే పాదయాత్రకు అనుమతి ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు కోమటిరెడ్డి భావిస్తున్నారు. మతి ఇవ్వకపోతే హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. దీనిపై కోమటిరెడ్డి మాట్లాడుతూ..12 ఏళ్లుగా బ్రాహ్మణ వెల్లెంల ఎత్తిపోతల పథకం పెండింగ్‌లో ఉందని, కరువు పీడిత ప్రాంతం కావడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా పాదయాత్ర చేసి తీరతానన్నారు.

Other News

Comments are closed.