భారీ అగ్నిప్రమాదం..43 మంది మృతి

share on facebook

ఢిల్లీ: ఢిల్లీలో సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 43కు చేరుకుంది. ఓ భవనంలో ఫ్యాక్టరీ కార్మికులు నిద్రిస్తుండగా ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఊపిరాడక చాలా మంది మృతిచెందారు. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ.. అగ్నిప్రమాద ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్న తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

Other News

Comments are closed.