మళ్లీ పెరిగిన పెట్రో ధరలు!

share on facebook

న్యూఢిల్లీ,జనవరి 13(జనంసాక్షి): దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 25 పైసల వరకు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.45కు పెరిగింది. అదేవిధంగా డీజిల్‌ ధర రూ.74.38 నుంచి రూ.74.63కు చేరింది. ఈ పెంపుతో జైపూర్‌లో పెట్రో, డీజిల్‌ ధరలు దేశంలోనే అత్యధికానికి చేరుకున్నాయి. ఇక్కడ లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.85, డీజిల్‌ రూ.83.87గా ఉన్నాయి. కాగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్‌ ధర రూ.91.07కు చేరగా, డీజిల్‌ ధర రూ.81.34గా ఉన్నది. చెన్నైలో- పెట్రోల్‌ రూ.87.18, డీజిల్‌ రూ.79.95 కోల్‌కతా- పెట్రోల్‌ రూ.85.92, డీజిల్‌ రూ.78.22 హైదరాబాద్‌- పెట్రోల్‌ రూ.87.85, డీజిల్‌ రూ.81.45 బెంగళూరు- పెట్రోల్‌రూ.87.30, డీజిల్‌ రూ.79.14 జైపూర్‌- పెట్రోల్‌ రూ.91.85, డీజిల్‌ రూ.83.87 2017, జూన్‌ 15 నుంచి చమురు కంపెనీలు పెట్రో ధరలను ప్రతి రోజు సవిూక్షిస్తున్నాయి. అప్పటివరకు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను నిర్ణయించేవి. కరోనా లాక్‌డౌన్‌ తర్వాత దేశంలో పెట్రోల్‌ ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి.

Other News

Comments are closed.