మోడెర్నా టీకా ధర ఖరారు

share on facebook

ఫ్రాంక్‌ఫర్ట్‌,నవంబరు 22(జనంసాక్షి):తాము అభివృద్ధి చేస్తున్న టీకా ఒక్కో డోసుకు ప్రభుత్వాల నుంచి 25 డాలర్ల నుంచి 37 డాలర్లు వసూలు చేసే అవకాశం ఉందని ప్రముఖ ఔషధ తయారీ సంస్థ మోడెర్నా ప్రకటించింది. సాధారణ ఫ్లూకి ఇస్తున్న వ్యాక్సిన్‌కు వసూలు చేస్తున్న 10 డాలర్ల నుంచి 50 డాలర్ల పరిధిలోనే కరోనా టీకా ధర కూడా ఉండే అవకాశం ఉందని సంస్థ సీఈవో స్టిఫానీ బాన్సెల్‌ జర్మనీకి చెందిన ఓ ప్రముఖ పత్రికకు తెలిపారు.మోడెర్నా టీకా కొనుగోలుకు ఇప్పటికే పలు దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. సోమవారం ఐరోపా సమాఖ్య(ఈయూ) మోడెర్నాతో ప్రత్యేకంగా చర్చలు జరిపింది. 25 డాలర్ల కంటే తక్కువ వసూలు చేస్తే మిలియన్ల డోసులు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చినట్లు బన్సెల్‌ తెలిపారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఈయూ కమిషన్‌ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఇంకా ఏవిూ ఖరారు కాలేదని వెల్లడించారు. త్వరలోనే ఐరోపా ప్రజలకు టీకా అందించడంపై సానుకూల ప్రకటన వెలువడే అవకాశం ఉందన్నారు.మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న మోడెర్నా రూపొందించిన ఎఖీఔం-1273 వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్లు సమాచార విశ్లేషణలో వెల్లడైందని ఇటీవల ఆ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ముందస్తుగా నిర్ణయించిన ప్రమాణాలకు అనుగుణమైన సమర్థతను తమ వ్యాక్సిన్‌ చేరుకుందని మోడెర్నా తెలిపింది. మొదటి మధ్యంతర విశ్లేషణలో భాగంగా 94.5శాతం సమర్థతతో వ్యాక్సిన్‌ పనితీరు కనబరిచినట్లు వెల్లడించింది.

Other News

Comments are closed.