వ్యక్తిగత పరిశుభ్రతలే ముఖ్యం

share on facebook

ఏలూరు,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  వ్యక్తిగత పారిశుద్యంతోనే అంటువ్యాధులకు దూరంగా ఉండగలమని వైద్యాధికారులు  అన్నారు. ప్రతి ఒక్కరు ఇందుకు కృషిచేయాలన్నారు. డెంగీ, గున్యా జ్వరాలకు ఇదే విరుగడని అన్నారు. అలాగే పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణపై నగర పంచాయతీ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించే దిశగా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రజలు ముందుండాలని అన్నారు. పురపాలక సంఘాలు, నగర పాలకసంస్థల పరిధిలో ప్రజలను చైతన్యం చేయాలని చెప్పారు. వార్డులవారీగా వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరైన లబ్దిదారులంతా నిర్మించేలా చైతన్యపరిచేందుకు ఇన్‌ఛార్జులుగా నియమించిన
సిబ్బంది లక్ష్యం సాధించేలా కృషి చేయాలని హెచ్చరించారు.  నూరుశాతం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా చూడాలన్నారు.

Other News

Comments are closed.