వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందే

share on facebook

తమిళనాట డిఎంకె ఆందోళన
చెన్నైన్యూఢిల్లీ,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) :  కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతున్నది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో ఇప్పటికే పంజాబ్‌ రైతులు ఢిల్లీ శివార్లలో ఆందోళన చేస్తున్నారు. వారికి బెంగాల్‌ సీఎం మమతాబెనర్జి, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మద్దతు తెలిపారు. అంతేగాక వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్‌, కేరళ రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి. తాజాగా తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే కూడా వ్యవసాయ చట్టాలపై నిరసన వ్యక్తంచేసింది. ఆ చట్టాల రద్దును కోరుతూ కోర్టుకు వెళ్లనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వివాదాస్పద వ్యసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ శనివారం ఉదయం సాలెంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి రైతులు భారీ సంఖ్యలో హాజరై కేంద్ర చట్టాలపై తమ వ్యతిరేకతను చాటిచెప్పారు. ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన స్టాలిన్‌.. ‘కేంద్ర చేసిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము కోర్టుకు వెళ్తాం. ఈ విషయంలో కేరళ, పంజాబ్‌ రాష్టాల్రు ఇప్పటికే కోర్టు మె/-లటెక్కాయి. మన ముఖ్యమంత్రి పళనిస్వామి తాను రైతు బిడ్డనని చెప్పుకుంటున్నాడు. అయితే, ఆయన ఇంతవరకు ఎందుకు వ్యవసాయ చట్టాలపై ఎలాంటి చర్య తీసుకోలేదని ప్రశ్నించారు.

Other News

Comments are closed.