సింగోటం నారసింహుడి సేవలో మంత్రి తలసాని

share on facebook

 

 

 

 

 

నాగర్‌కర్నూల్‌,నవంబర్‌ 23  (జనంసాక్షి) :  కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని సింగోటం గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సమేతంగా దర్శించు కున్నారు. ఈ సందర్భంగా తలసాని కుటుంబ సభ్యులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన అనంతరం మంత్రి తలసానికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సింగోటం గ్రామ సర్పంచ్‌ తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

 

 

Other News

Comments are closed.