హెచ్‌-4 వీసాదారులకు.. రక్షణగా అమెరికాలో బిల్లు

share on facebook

– హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లు ప్రవేశపెట్టిన ఇద్దరు శాసనకర్తలు
వాషింగ్టన్‌, మే30(జ‌నంసాక్షి) : హెచ్‌-4 వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారికి రక్షణగా కాలిఫోర్నియాకు చెందిన ఇద్దరు శాసనకర్తలు హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. హెచ్‌-4 వీసా ఆధారంగా పని చేయడానికి అనుమతులు పొందుతున్నవారిపై నిషేధం విధించే పక్రియను ప్రారంభించనున్నామని అక్కడి ¬మ్‌లాండ్‌ సెక్యూరిటీ విభాగం(డీహెచ్‌ఎస్‌) ప్రకటించిన నేపథ్యంలో వారు ఈ బిల్లు ప్రవేశ పెట్టడం గమనార్హం. హెచ్‌-1బీ వీసాపై ఉద్యోగం చేస్తున్న వారి జీవిత భాగస్వాములకు ఇచ్చేదే హెచ్‌-4 వీసా. అయితే హెచ్‌-4వీసా పని అనుమతుల వల్ల అమెరికన్లు భారీగా నష్టపోతున్నారని.. నిబంధనలను మారుస్తామని ట్రంప్‌ సర్కార్‌ వాదిస్తూ వస్తోంది. తాజాగా అందుకనుగుణంగా నిబంధనలను త్వరలోనే మార్చనున్నామని డీహెచ్‌ఎస్‌ ప్రకటించడంతో.. అనేక మంది విదేశీయులు ఆందోళనకు గురవుతున్నారు. హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికాలో ఉపాధి పొందుతున్న వారిలో భారతీయులు గణనీయ సంఖ్యలో ఉండడం గమనార్హం. హెచ్‌-1బీ వీసా ద్వారా అమెరికా ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న వారి కుటుంబాల ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారి జీవితభాగస్వాములైన హెచ్‌-4వీసాదారులకు పని అనుమతి కల్పించిందని పలువురు శాసనకర్తలు గుర్తుచేశారు. హెచ్‌-4 ఎంప్లాయిమెంట్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ పేరిట ఒబామా హయాంలో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. దీనిద్వారా సిలికాన్‌ వ్యాలీ లాంటి ఖరీదైన ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఎంతో ఉపశమనం లభిస్తోందన్నారు. తాజా నిర్ణయంతో అత్యంత నైపుణ్యం గల అనేక మంది హెచ్‌-4వీసాదారులు ఉపాధి కోల్పోతారన్నారు. దీనివల్ల ప్రాంతీయంగా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ చట్టం ద్వారా దాదాపు లక్ష మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉండడం గమనార్హం. అయితే ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు ట్రంప్‌ పాలక వర్గానికి అడ్డంకిగా మారాయి. దీంతో నిబంధనలు సడలించడానికి సిద్ధమయ్యారు.

Other News

Comments are closed.