16నుంచి కాంగ్రెస్‌ సవిూక్షలు: గౌతమ్‌

share on facebook

విజయవాడ,మే4(జ‌నంసాక్షి):  ఎపి కాంగ్రెస్‌ కమిటి ఎన్నికల సవిూక్షలు మే 16 నుంచి 19 వరకు విజయవాడలో నిర్వహించనున్నామని ఎపిసిసి జనరల్‌ సెక్రటరీ గౌతమ్‌ ప్రకటించారు. శనివారం ఉదయం విజయవాడలో  గౌతమ్‌ మాట్లాడుతూ… ఈ సవిూక్షలకు ఎపి వ్యవహారాల ఇంచార్జీ ఉమెన్‌ చాంది,పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డిలు విచ్చేస్తారని తెలిపారు. పార్లమెంట్లవారీగా సవిూక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రత్యేక ¬దా కోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు యుపిఎ కూటమికి మద్దతు తెలపాలని కోరారు.
రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సఅష్టించే విధంగా మోడి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఆపద్ధర్మ ప్రభుత్వం కాదని, ఇసి అనుమతి అవసరం లేదని భావించినప్పుడు సిఎం ఎలక్షన్‌ కమిషన్‌ అనుమతి కోసం లేఖ రాయవలసిన అవసరం ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితులు ప్రజలలో గందరగోళాన్ని సఅష్టిస్తాయని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో ఇసి స్పష్టత ఇవ్వాలని గౌతమ్‌ డిమాండ్‌ చేశారు.

Other News

Comments are closed.