తెలంగాణ

ప్రధాని మోడీ డ్రీమ్‌టీంలో తెలంగాణ బిడ్డ!

తెలంగాణ బిడ్డకు గొప్ప అవకాశం దక్కింది. నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా వార్తలకెక్కిన చంద్రకళకు ప్రమోషన్ లభించింది. యూపీ క్యాడర్ అధికారి అయిన ఈ తెలంగాణ తేజం.. 2014లో నాసిరకం రోడ్లు వేసిన అధికారులను, కాంట్రాక్టర్లను పబ్లిగ్గా నిలదీసి సంచలనం సృష్టించారు. ఓయూ నుంచి ఎంఏ పట్టా పుచ్చుకున్న చంద్రకళ 2008లో ఐఏఎస్ టాపర్‌గా నిలిచారు. … వివరాలు

ఫార్మాసిటీతో ఉపాధి

హైదరాబాద్‌: ఫార్మాసిటీతో మూడు లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగా , పరోక్షంగా లభిస్తుందని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. ఫార్మాసిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.

భూసేకరణ బిల్లు సహా 4 బిల్లులు

హైదరాబాద్‌: భూసేకరణ బిల్లు సహా మరో 4 బిల్లులను ఇవాళ అసెంబ్లీలోసిఎం కెసిఆర్‌ ప్రవేశపెట్టారు. భూసేకరణతో పాటు వ్యాట్‌ సవరణ, జిహెచ్‌ఎంసి చట్ట సవరణ బిల్లులను , ఖమ్మం పోలీసు కమిషనరేట్‌ బిల్లును ఆయనప్రవేశపెట్టారు.

భాజపా వాయిదా తీర్మానం

హైదరాబాద్‌: పార్లమెంట్‌లో ఎస్సీ వర్గీకరన బిల్లు ప్రవేశపెట్టాలంటూ భాజపా వాయదా తీర్మానం చేసింది. ప్రధాని సహా కేంద్రాన్ని కోరేందుకు సిఎం నేతృత్వంలో అఖిలపక్షం తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తోంది. మాదిగ, మాదిగ ఉపకులాలను ఎ,బి,సి,డిలుగా వర్గీకరించాలని గతంలో అసెంబ్లీ తీర్మానం మేరకు ప్రధాని వద్దకు అఖిలపక్షం తీసుకెళ్లాలని వాయిదా తీర్మానం చేసింది.

తెలంగాణకు హైదరాబాద్‌ ఆర్థికశక్తి : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌ ఆర్థికశక్తి అని మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. హైదరాబాద్ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచేందుకే కృషిచేస్తున్నామని అన్నారు. సోమవారం అసెంబ్లీలో బీజేపీ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో సమస్యల పరిష్కారానికి 100 రోజుల ఎజెండా రూపొందించామని, 100 రోజుల ఎజెండాలో ఎన్నో హామీలు నెరవేర్చామని చెప్పారు. మై జీహెచ్‌ఎంసీ … వివరాలు

కేసీఆర్ గారు ప్రజలకు క్షమాపణ చెప్పాలి: వరవరరావు

వరంగల్‌: తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత ఆకుల భూమయ్య సంస్మరణ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమని విరసం నేత వరవరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం నియంతృత్వ ధోరణి విడనాడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దుమ్ముగూడెంలో అదుపులోకి తీసుకున్న ప్రజాస్వామిక వేదిక ప్రతినిధులను తక్షణం విడుదల చేయాలని, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌పై … వివరాలు

నేడు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథపై చర్చ

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో నాలుగో రోజైన నేడు (మంగళవారం) రెండు ప్రాజెక్టు అంశాలపై చర్చ జరగనుంది. శాసనసభలో నేడు మిషన్ భగీరథ అంశంపై చర్చించనుండగా, శాసనమండలిలో చెరువుల పునరుద్ధరణ, పూడికతీత కార్యక్రమం మిషన్ కాకతీయపై చర్చ జరుగుతుంది.కాగా, సోమవారం శాసనసభలో గ్యాంగ్ స్టర్ నయీం, అతని అనుచరులు సాగించిన నేర కార్యకలాపాలపై తెలంగాణ రాష్ట్ర … వివరాలు

మీ నోటులో చిప్ ఉందా?

న్యూఢిల్లీ: ఆర్బీఐ కొత్త రెండు వేల నోటు విడుదల చేయగానే ఆ నోటుపై ఎన్నో ఊహాగానాలు, పుకార్లు హల్‌చల్ చేశాయి. సోషల్ మీడియా వేదికగా కొందరు అసత్య వార్తలను ప్రచారం చేశారు. కొత్త రెండు వేల నోటుపై బాగా చక్కర్లు కొట్టిన అంశం చిప్. కొత్త నోటులో చిప్ అమర్చారని, అందులోని జీపీఎస్ సిస్టమ్ ద్వారా దొంగ … వివరాలు

రాష్ట్ర ఆదాయం తగ్గదు: ఈటెల

హైదరాబాద్: నోట్ల రద్దు తర్వాత కొంత ఇబ్బందులు వచ్చాయని, అయితే దీని వల్ల తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ బడ్జెట్‌లో కొత్తగా చేర్చిందేమీలేదన్నారు. స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ … వివరాలు

మాపై నిందలు వేయొద్దు: కేసీఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ పదేళ్ల కాలంలోనే నయీం దందాలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చ సందర్భంగా టీడీపీ హయాం నుంచే నయీం దందాలు మొదలయ్యాయని, టీడీపీ హయాంలో ఉన్న సగంమంది మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన విమర్శలపై కేసీఆర్ మాట్లాడుతూ నయీం నేర చర్యలకు పాల్పడుతున్న సమయంలో జీవన్‌రెడ్డి సైతం … వివరాలు