తెలంగాణ

గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణనే ఫస్ట్‌

పదికోట్ల సంపదను సృష్టిచామన్న మంత్రి తలసాని అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వివరణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) రాష్ట్రంలో గొర్రెల పంపిణీతో రూ. 10 కోట్ల సంపదను సృష్టించామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. అలాగే గొర్రెల కాపరులకు ఉపాధి చూపామని అన్నారు. దీంతో వారికి ఆర్థిక భరోసా ఏర్పడిరదన్నారు. గొర్రెల ఉత్పత్తిలో తెలంగాణ … వివరాలు

బార్‌ షాపుల ఏర్పాట్లలోనూ రిజర్వేషన్లు పాటిస్తాం

అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి శ్రీనివాసగౌడ్‌ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : మద్యం షాపుల్లో రిజర్వేషన్లు కల్పించిన మాదిరిగానే బార్‌ అండ్‌ రెస్టారెంట్లలోనూ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మద్యం షాపుల్లో గౌడ కులస్తులకు 15 శాతం, … వివరాలు

జీవవైవిధ్యానికి పులుల సంరోణ ముఖ్యం

అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే ఇండియా ఫర్‌ టైగర్స్‌ ఏ ర్యాలీ ఆన్‌ వీల్స్‌ ప్రారంభించిన మంత్రి హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): జీవ వైవిధ్యానికి ప్రధాన ఆధారంగా నిలుస్తున్న పులులను సంరక్షించు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జంతుజాలంను రక్షిస్తేనే అడవుల సంరక్షణ … వివరాలు

అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్దికి కెసిఆర్‌ కృషి

బంగారు తెలంగాణ సాధనే బాపూజీకి సరైన నివాళి కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహావిష్కరణలో హరీష్‌ రావు జోరువానలోనూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సిద్దిపేట,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): అన్ని వర్గాల సంక్షేమం కోసం పోరాడిన, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బంగారు … వివరాలు

హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం

పలు జిల్లాల్లూను భారీ వర్షాలు తుపాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తం మ్యాన్‌హోల్‌లో కొట్టుకోపోయిన టెక్కీ కోసం గాలింపు హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జనంసాక్షి) హైదరాబాద్‌ మహా నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. బంగాళాఖాతాంలో ఏర్పడిన గులాబ్‌ తుపాను ప్రభావంతో పాటు, ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు … వివరాలు

బిజెపి,కెసిఆర్‌ ఇద్దరూ ఇద్దరే

కేంద్రాన్ని నిలదీసే దమ్ము కెసిఆర్‌కు లేదు షర్మిల వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదు: జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబర్‌27(జనంసాక్షి) బీజేపీ, కేసీఆర్‌ ఇద్దరు ఒక్కటేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించాలంటే సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. కేవలం తన పదవి కాపాడుకునే ప్రయత్నాల్లో కెసిఆర్‌ ఉన్నారని అన్నారు. కేంద్రంతో చర్చల్లో ఏం జరుగుతుందో … వివరాలు

మహిళాబిల్లు తేవడంలో విఫలం: ఐద్వా

హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : మహిళా రిజర్వేషన్‌ బిల్లు తేవడంలో ప్రభుత్వం విఫలమయ్యిందని ఐద్వా నేతలు అన్నారు. నాటి కాంగ్రెస్‌, నేటి బీజేపీ ప్రభుత్వాలు మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని చెప్పి మొండి చేయి చూపించాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంక్‌ రాజకీయాల కోసం సంక్షేమ పథకాలను ఉపయోగించుకుంటున్నాయని అన్నారు. దీనేఇపై ఎక్కడిక్కడ బిజెపిని … వివరాలు

తగ్గుతున్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : సురక్షిత వాహన ప్రయాణానికే ట్రాఫిక్‌ నిబంధనలు అనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలని, నిబంధనలు ఉల్లంఘించకుండా వాహనాలు నడిపితే అందరూ సురక్షితంగా ప్రయాణిస్తారని ట్రాఫిక్‌ పోలీసులు అన్నారు. ఇటీవల తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలు ఇస్తోందని అన్నారు. ఎంవీ యాక్టులో నియమాలను అమలు పరిచే దిశగా ట్రాఫిక్‌ విభాగం అడుగులు వేస్తుందన్నారు. ట్రాఫిక్‌ … వివరాలు

మొక్కల పెంపకం నిత్యకృత్యం కావాలి

ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌27 జనంసాక్షి : మొక్కల పెంపకం ఆవశ్యకతలను ప్రతి పాఠశాలలో వివరించాలని ఎమ్మెల్యే జోగురరామన్న అన్నారు. పాఠశాల స్థాయి నుంచే మొక్కల పెంపకం జీవితంలో భాగం కావాల న్నారు. మొక్కలు ఏ విధంగా నాటాలి, వాటికి నీరు ఏ విధంగా పోస్తే చక్కగా పెరుగుతాయో వారికి విశదీకరించాలని అన్నారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటడాన్ని దైనందిన … వివరాలు

పునరావాస పరిహారం చెల్లించాలి

భద్రాచలం,సెప్టెంబర్‌27 జనంసాక్షి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస పరిహారం వెంటనే విడుదల చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్‌ చేశారు. భూములకు పరిహారం ఇచ్చి నిర్వాసితులకు పునరావాస పరిహారం ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. పునరావాస ప్యాకేజీ తెలంగాణలో కుటుంబానికి రూ.12 లక్షల 50 వేలు ఇస్తున్నారని ఇక్కడ కూడా అదే ప్యాకేజీ ఇవ్వాలన్నారు. గిరిజనులకు భూమికి భూమి, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి … వివరాలు