అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి..


ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ..
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 28
మహిళ శిశు సంక్షేమ శాఖ అంగన్వాడి కేంద్రాల సేవలను అర్హులందరూ వినియోగించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందాలని అంగన్వాడి సూపర్వైజర్లు రాజశ్రీ, స్రవంతి అన్నారు. మంగళవారం శంకరపట్నం మండలంలోని కొత్తగట్టు ,కేశవపట్నం గ్రామాల్లో అంగన్వాడి ఆధ్వర్యంలో విద్యార్థులకు పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించి, పోషక ఆహారంపై శుభ్రతపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మమత, భారతి, విజయ, తోపాటు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, ఆయాలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.