అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం.
అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం.-పట్టు వస్త్రాలను సమర్పించిన కోరుట్లఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.మల్లాపూర్ మార్చి :30(జనం సాక్షి)మండల కేంద్రంతో పాటు వాల్గొండ శ్రీ రామలింగేశ్వర ఆలయం మరియు సిర్పూర్ గ్రామం లో గురువారం రోజున శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాములవారికళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కళ్యాణానికి శాసనసభ్యులు విద్యాసాగర్ రావు దంపతులు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించి, మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దండిక గంగూ రాజన్న ఎంపీటీసీ క్యాతం సుజాత నరేష్ రెడ్డి ,జడ్పిటిసి ఎంపిపి సరోజన, ఆదిరెడ్డి ,తోట శ్రీనివాస్ గోవిందు నాయక్ ఏనుగు రాంరెడ్డి సుధాకర్ రాజన్న సంగరాజన్న పెద్దిరెడ్డి లక్ష్మి నరసయ్య మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు.