అండర్‌-19 ప్రపంచకవ్‌ సెమీఫైనల్స్‌కు చేరిన భారత్‌

ఆస్ట్రేలియాలో జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ క్రికెట్‌పోటీల్లో భారత్‌ సెమీ ఫైనల్స్‌కు చేరింది. ఈ రోజు జరిగిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో పాకిస్థాన్‌పై ఒక్క వికెట్‌ తేడాతో భారత్‌ విజయం సాధించింది. పాక్‌ జట్టు 136 పరుగులకు ఆలౌట్‌ కాగా భారత్‌ 9 వికెట్ల నష్టానికి 137 పరుగులతో విజయలక్ష్యాన్ని చేరుకుంది.