అగ్ని -1 పరీక్ష విజయవంతం

బాలాసోర్‌(ఒడిశా): భారత అణ్వాయుధ క్షిపణి సామర్ధ్య పరీక్షకు మరో ఘన విజయం లభించింది. 700 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల అగ్ని-1 ఉపరితల క్షిపణికి శుక్రవారం ఒడిశాలో నిర్వహించిన ప్రయోగ పరీక్ష విజయవంతం అయ్యింది. వీలర్‌ ఐలాండ్‌ నుంచి నిర్వహించిన అగ్ని-1 ఉపరితల క్షిపణి ప్రయోగం విజయవంతమె,ౖ లక్ష్యన్ని ఛేదించిందని ఐటీఆర్‌ సంచాలకుడు ఎంకేవీ ప్రసాద్‌ వెల్లడించారు. వీలర్‌ ఐలాండ్‌లోని ఐటీఆర్‌ వద్ద ఉదయవ 10.10 నిమిషాలకు ఉపరితలం నుంచి ఉపరితల లక్ష్యాలను ఛేదించే ఈ క్షిపణిని ప్రయోగించారని రక్షణ శాస్త్రవేత్త ఒకరు వెల్లడించారు. 12 టన్నుల బరువుతో 15 మీటర్ల ఎత్తు ఉండే ఈ క్షిపణి టన్ను బరువు గల ఆయుధాలను మోసుకు పోగలదు.