అతిథి మర్యాదలు కుదరవు

పట్టాభి సాధారణ ఖైదీయే..
శ్రీన్యాయమూర్తులు సాధారణ జీవితమే గడపాలి
శ్రీవిలాస జీవిత పర్యావసానమే ..
శ్రీబెయిల్‌ స్కాం మాజీ జడ్జిని తలంటిన కోర్టు

హైదరాబాద్‌, జూన్‌ 23 (జనంసాక్షి):
గాలి జనార్దనరెడ్డి బెయిల్‌ స్కాంలో అరెస్టయిన మాజీ జడ్జి పట్టాభి రామారావు ప్రత్యేక ఖైదీ పిటిషన్‌ను ఎసిబి కోర్టు శనివారంనాడు తిరస్కరించింది. అయితే ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నందున ప్రత్యేక వైద్య సదు పాయాలు కల్పించాలని కోర్టు జైలు అధికా రులను ఆదేశించింది. ఈ నెల 19న ఈ కేసులో పట్టాభిని ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇప్ప టివరకు తాను నిబద్ధతతో విధులు నిర్వహిం చానని, అనారోగ్య సమస్యలతో బాధపడు తున్నందున తనను ప్రత్యేక ఖైదీగా పరిగణించి వసతులు కల్పించాలని ఆయన కోర్టును కోరారు. ఇదే కేసులో నిందితులు పట్టాభి కుమారుడు రవిచంద్ర, రిటైర్డు జడ్జి చలపతి రావులను అయిదు రోజుల పాటు ఎసిబి కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వు లిచ్చింది. గాలి జనార్దనరెడ్డికి బెయిల్‌ ఇవ్వడంలో అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని ఎసిబి కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయలు చేతులు మారాయని, ఆ సొమ్ము ఎవరి నుంచి ఎవరెవరికి వెళ్లిందీ తదితర వివరాలన్నీ తెలుసుకోవాల్సి ఉన్నం దున రవిచంద్ర, చలపతిరావులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఒక పథకం ప్రకారం పట్టాభి మే నెల 11వ తేదీన న్యాయమూర్తిగా వచ్చి గాలికి బెయిల్‌ మంజూరు చేశారని తెలిపింది. అతని బెయిల్‌ పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ కింది కోర్టులో బెయిల్‌ మంజూరు చేయడం ఆయన దురుద్దేశం స్పష్టమవుతోందని కోర్టుకు తెలిపింది. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉన్నందున తమ కస్టడీకి అప్పగించాలని కోరింది. బెయిల్‌ మంజూరైన మరుసటి రోజు చలపతి రావు రంగు కవర్లలో తెచ్చిన సొమ్మును బ్యాంకు లాకర్లలో భద్రపరిచారని, ఈ కవర్లు తెచ్చిన కోర్టు ఉద్యోగి నుంచి వాంగ్మూలం సేకరిం చామని కోర్టులో ఎసిబి వాదించింది. ఇప్పటికే సంబంధిత పత్రాలు, నగదు, అన్నింటిని సిబిఐ స్వాధీనం చేసుకుందని, కొత్తగా ఎసిబి సాధించేదేమీ లేదని, అందువల్ల కస్టడీకి అప్పగించొద్దంటూ నిందితుల తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. వాదోపవా దాలు ముగిశాక శనివారంనాడు నిందితులు ఇరువుర్ని అయిదు రోజుల పాటు ఎసిబి కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.