అదుపుతప్పి దూసుకెళ్లిన లారీ ఇద్దరి మృతి

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్‌ ఖాన్‌పేటలో ఆదివారం ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన నీళ్లు పట్టుకుంటున్న మహిళలపైకి దూసుకెళ్లింది. ఈఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.క్షతగాత్రులను సమీప  ఆసుపత్రికి తరలించారు.