అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటా : గాదె వెంకటరెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలనే గతంలో తెదేపా సమైక్యవాదాన్ని పక్కనబెట్టి తెరాసతో జట్టుకట్టిందని ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ విమర్శించారు. రాష్ట్ర సమైక్యంగా ఉండాలని  అఖిలపక్షంలో చెప్పానని ఆయన వెల్లడించారు.