అనుమతిచ్చి అరెస్టు చేసిన ప్రభుత్వం: కేకే

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ కాంగ్రెస్‌ నేత కేకే అన్నారు. ఆయన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం ముగిసింది. ఎవరినీ అరెస్టు చేయం అని చెప్పి అరెస్టులు చేశారన్నారు. అరెస్టులపై మాట్లాడదామని వెళ్తే సీఎంను కలవనివ్వలేనది, 8 మంది ఎంపీలు సీఎంను కలిసేందుకు వెళ్తే అరెస్టు చేశారని కేకే ఆరోపించారు.