అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం పెద్ద అంబర్‌పేటలో ఇళ్ల మద్య ఖాళీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ అనుమానస్పదంగా మృతి చెందింది. 20 రోజులక్రితం భార్యా భర్తలు వచ్చి ఖాళీ ప్రాంతంలో గుడిసె వేసుకున్నారు. పది రోజుల నుంచి ఈ గుడిసె పూర్తి కప్పేసి ఉంది. ఎవరూ లేరనుకున్న చుట్టుపక్కల వారు ఈ రోజు దుర్వాసన రావడంతో గుడిసె తొలిగించి చూశారు. అందులో 40 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హయత్‌నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భర్తే హత్య చేసి పరారైతట్లు అనుమానంతో దర్యాప్తు చేస్తున్నారు.