అన్న దీక్షకు మద్దతుగా హైదరాబాద్‌లో దీక్షలు

హైదరాబాద్‌: అవినీతి మంత్రులు, ఎంపీలపై చర్య తీసుకోవాలంటూ అన్నా బృందం ఢిల్లీలో చేపట్టిన నిరవధిక దీక్షకు మద్దతుగా ఇండియా ఎగైనెస్ట్‌ కరప్షన్‌ సంస్థ హైదరాబాద్‌ శాఖ ఇందిరాపార్కు వద్ద దీక్ష చేపట్టింది. కేంద్ర ప్రభుత్వంలో 15మంది మంత్రులు, 163మంది ఎంపీలు పీకల్లోతు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారని ఐఏసీ ప్రతినిధులు ఆరోపించారు. వీరిని ఆరునెలల్లోగా వేగంగా విచారించేందుకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు, ప్రత్యేక పరిశోధన బృందాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.