అభియెగాలు నమోదు చేయొద్దు

-ఓఎంసి కేసులో గాలి పిిటిషన్‌
హైదరాబాద్‌ : ఓబులాపురం మైనింగ్‌ ఇనుప ఖనిజం అక్రమ రవాణా కేసులో తమపై అభియోగాల నమోదు ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధన్‌ రెడ్డి, మరికొంత మంది నిందితులు సిబిఐ కోర్టులో మంగళవారం ఫిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో సిబిఐ పూర్తి విచారణ జరిపే వరకు నేరాల నమోదు ప్రక్రియను నిలిపివేయాలని గాలి జనార్ధన్‌ రెడ్డి, బివి శ్రీనివాసులు రెడ్డి, అలీఖాన్‌ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సిబిఐ పంపిన కొన్ని పత్రాలు తనకాందలేదంటూ శ్రీలక్ష్మి తరుపున ఆమె న్యాయవాది కూడా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దర్యాప్తు పూర్తయిన తర్వాతే కేసుల నమేదు ప్రక్రియ మొదలుపెట్టాలని, అలా కాని పక్షంలో నిందితులపై ప్రతికూల ప్రభావం పడుతుందని పిటిషన్లలో పేర్కోన్నారు. దీనిపై స్పందన తెలపాలంటూ న్యాయమూర్తి దుర్గాప్రసాదరావు సిబిఐని ఆదేశించారు. కేసును నేటికి వాయిదా వేశారు.