అమెరికాలో సగం పౌరులకు వ్యాక్సినేషన్‌


జో బైడన్‌ లక్ష్యం నిర్దేశించడంతో చకచకా ఏర్పాట్లు
డెల్టా వేరియంట్‌ భయాలతో మరింత అప్రమత్తమైన అమెరికా
వివరాలు వెల్లడిరచిన శ్వేతసౌధం ప్రతినిధి
వాషింగ్టన్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి): అమెరికా మొత్తం జనాభాలో సగం మందికి పూర్తిస్థాయి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందచేసినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. కరోనా డెల్టా రకం అగ్రదేశాన్ని మరోసారి కలవరపెడుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను ఇటీవల వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజా మైలురాయిని చేరుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధంలో వ్యాక్సినేషన్‌ సమాచార విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సైరస్‌ షాపర్‌ ప్రకటించారు. అమెరికా మొత్తం జనాభాలో సగం మందికి పూర్తిస్థాయి కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందిందని శ్వేతసౌధం ప్రకటించింది. కరోనా డెల్టా రకం అగ్రదేశాన్ని మరోసారి కలవరపెడుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ను ఇటీవల వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజా మైలురాయిని చేరుకున్నారు. ఈ విషయాన్ని శ్వేతసౌధంలో వ్యాక్సినేషన్‌ సమాచార విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సైరస్‌ షాపర్‌ ప్రకటించారు. అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్దేశిరచిన 70 శాతం మంది యువజనులకు కనీసం ఒక డోసు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక నెల ఆలస్యమైంది. జులై 4 నాటికి ఈ మైలురాయిని చేరుకోవాలని బైడెన్‌ ఆదేశించారు. కానీ, మధ్యలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కాస్త నెమ్మదించడంతో లక్ష్య ఛేదనలో జాప్యం జరిగింది. ఏప్రిల్‌ మధ్యలో సగటున రోజుకు 3.3 మిలియన్ల డోసులు పంపిణీ చేశారు. అది ఓ దశలో 50 వేలకు పడిపోయింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 100 రోజుల్లో 100 మిలియన్‌ డోసుల పంపిణీ లక్ష్యాన్ని బైడెన్‌ యంత్రాంగం సునాయాసంగా చేరుకున్న విషయం తెలిసిందే.అర్హుల్లో 58.5 శాతం మందికి.. అర్హుల్లో 58.5 శాతం మందికి.. అర్హుల్లో 58.5 శాతం మందికి.. అమెరికాలో ఇప్పటి వరకు 165 మిలియన్ల మందికి రెండు డోసుల మోడెర్నా లేదా ్గªజైర్‌ టీకాగానీ లేదా ఏక డోసు జాన్సన్‌ టీకా గానీ అందింది. నిజానికి అమెరికా మొత్తం జనాభాలో సగం మందికి అంటే.. టీకా అందుబాటులోకి రాని 0`11 ఏళ్ల పిల్లలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఒకవేళ టీకా తీసుకోవడానికి అర్హత గల వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే 58.5 శాతం మందికి వ్యాక్సిన్‌ అందినట్లు సీడీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇక మొత్తం జనాభాలో 58.4 శాతం అంటే 193 మిలియన్ల మందికి కనీసం ఒక డోసు టీకా అందింది. అమెరికాలో ఇప్పటి వరకు 165 మిలియన్ల మందికి రెండు డోసుల మోడెర్నా లేదా ఫైజర్‌ టీకాగానీ లేదా ఏక డోసు జాన్సన్‌ టీకా గానీ అందింది. అమెరికాలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం 2020, డిసెంబరు 14న ప్రారంభమైంది. సగం మందికి టీకా ఇవ్వడానికి దాదాపు 33 వారాలు పట్టింది. అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్దేశించిన 70 శాతం మంది యువజనులకు కనీసం ఒక డోసు అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక నెల ఆలస్యమైంది. జులై 4 నాటికి ఈ మైలురాయిని చేరుకోవాలని బైడెన్‌ ఆదేశించారు.
కానీ, మధ్యలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కాస్త నెమ్మదించడంతో లక్ష్య ఛేదనలో జాప్యం జరిగింది. ఏప్రిల్‌ మధ్యలో సగటున రోజుకు 3.3 మిలియన్ల డోసులు పంపిణీ చేశారు. అది ఓ దశలో 50 వేలకు పడిపోయింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత 100 రోజుల్లో 100 మిలియన్‌ డోసుల పంపిణీ లక్ష్యాన్ని బైడెన్‌ యంత్రాంగం సునాయాసంగా చేరుకున్న విషయం తెలిసిందే. డెల్టా వేరియంట్‌ విజృంభిస్తుండడంతో
న్యూయార్క్‌, లాస్‌ఏంజిల్స్‌ సహా కొన్ని కీలక ప్రాంతాల్లో మరోసారి ఆంక్షలు విధించారు. గతవారం సగటున రోజుకు 90 వేల కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతకు క్రితం వారంతో పోలిస్తే కొత్త కేసులు ఏకంగా 43 శాతం ఎగబాకాయి. దీంతో ఆసుపత్రులకు తాకిడి పెరిగింది. గత రెండు వారాలతో పోలిస్తే 44 శాతం పెరిగినట్లు షాపర్‌ వెల్లడిరచారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన సీడీసీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. గత ఏడు రోజుల సగటు వ్యాక్సినేషన్‌ క్రితం వారంతో పోలిస్తే 11 శాతం.. గత రెండు వారాలతో పోలిస్తే 44 శాతం పెరిగినట్లు షాపర్‌ వెల్లడిరచారు.