5 కోట్లతో కందకం రోడ్డు పనులను ప్రారంభించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

సదాశివపేట జనవరి 4(జనం సాక్షి)పట్టణంలో కందకం రోడ్డులో సెంటర్ లైటింగ్, డివైడర్, రోడ్డు పనులకు 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులకు ఆదివారం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 2014 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో 20 కోట్ల రూపాయలతో కందకం రోడ్డు పనులను ప్రారంభించి దాదాపు 15 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం 9 ఏళ్ల పాలనలో కందకం రోడ్డు అభివృద్ధి పనులను చేపట్టకుండా నిలిపి వేసిందని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిలిపివేసిన కందకం రోడ్డు పనులను 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరుగుతుందని, ఈ విషయాన్ని పట్టణ ప్రజలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుపేదలకు లబ్ధి చేకూర్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడిల రామ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు పట్లూరి నాగరాజ్ గౌడ్,గుండు రవి, లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్, రాయిపాడు రమేష్, వాజిద్,మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్,నాయకులు కోడూరి శరత్, మామిడి రాజు,తుకారాం,బిట్ల ప్రేమ్ ,షెజ్జీ, సాబేర్, వసీం దాదా, మాని, లాజర్,లడ్డు, కార్యకర్తలు,ఆర్ అండ్ బి అధికారులు ,మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.


