జిల్లాలు, రెవెన్యూడివిజన్లు, మండలాలను పునర్‌వ్యవస్థీకరిస్తాం

` గత పాలకులు అశాస్త్రీయంగా విభజించారు
` అసెంబ్లీలో చర్చించి సరిచేస్తాం: మంత్రి పొంగులేటి
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా, అసంబద్దంగా రూపొందించిందని రెవెన్యూమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. దీనిని సవరించాల్సి ఉందన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మాట్లాడుతూ..మ్యాజిక్‌ ఫిగర్‌ కోసమే రాష్ట్రంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టిందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. బీఆర్‌ఎస్‌ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్‌వ్యవస్థీకరణను సరిచేస్తామని పొంగులేటి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వ తప్పదాలతో ఒకే నియోజకవర్గంలోని నాలుగు మండలాలు.. నాలుగు జిల్లాల్లో ఉండే పరిస్థితి ఏర్పడిరదన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి అందరి ఆమోదంతో పునర్‌వ్యవస్థీకరణ చేస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు.