కవిత రాజీనామా ఆమోదం

` ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్‌ ఆమోదం తెలిపారు. నిజామాబాద్‌ స్థానికసంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన కవిత… ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాజీనామాను ఆమోదించడంతో.. ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.